హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో రాష్ట్ర స్థాయి టైక్వాండో ఛాంపియన్‌షిప్

GNTR: తెనాలిలో జరిగిన 5వ ఏపీ తాడు కిడ్స్ టైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో గుంటూరు జిల్లా ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచింది. ఈస్ట్ గోదావరి ద్వితీయ, అనకాపల్లి తృతీయ స్థానాలు సాధించాయి. గుంటూరు విజయంలో తెనాలి డాన్ టైక్వాండో స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులు 15 స్వర్ణ, 9 రజత, 10 కాంస్య పతకాలు సాధించి కీలక పాత్ర పోషించారు. 275 మందికి పైగా ఈ పోటీలలో పాల్గొన్నారు.