హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మిడ్ మానేరు రిజర్వాయర్‌కు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

SRCL: బోయిన్‌పల్లి మండలం మాన్వాడ మిడ్ మానేరు రిజర్వాయర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి 1,709 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 6 గంటల వరకు రిజర్వాయర్ నీటిమట్టం 315.19 మీటర్లుగా, నీటి నిల్వ 20.848 టీఎంసీలుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి 27.171 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 170 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. స్పిల్‌వే గేట్లు మూసే ఉన్నాయి.