హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఘనంగా మహాలింగార్చన

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం చివరి సోమవారం , పునర్వసు నక్షత్రం సందర్భంగా మహాలింగార్చన రాత్రి ఘనంగా జరిగింది ఆలయ సన్నిధిలో 11 మంది వేదపండితులు లింగాకారంలో 365 జ్యోతులు వెలిగించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, గణపతికి అథర్వశీర్ష అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు జరిపారు.