హైదరాబాద్: 28°C
తెలంగాణ

మౌంటెన్ బైక్ సైక్లింగ్‌లో శిల్ప చౌవాన్ సత్తా

NZB: మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో నిర్వహించిన 11వ రాష్ట్ర స్థాయి మౌంటెన్ బైక్ సైక్లింగ్ పోటీల్లో నిజామాబాద్ క్రీడాకారిణి శిల్ప చౌవాన్ రెండు పతకాలు సాధించింది. టైమ్ ట్రయల్‌లో వెండి, మాస్ స్టార్ట్‌లో బంగారు పతకం కైవసం చేసుకుంది. జిల్లా సైక్లింగ్ సంఘం ప్రతినిధులు శిల్పను అభినందించారు.