VZM: కొత్తవలస మండలం అడ్డూరువానిపాలెం గ్రామ సమీపంలో ఉన్న ఓ కారు షెడ్ లో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక అగ్నిప్రమాద కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.ఈ ఘటనలో మరమ్మతులకు వచ్చిన మూడు పాతకార్లు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ 5లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అగ్నిప్రమాదం.. మూడు కార్లు దగ్ధం


