హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

IEI అవార్డుకు ఎంపికైన JNTU సీనియర్ ప్రొఫెసర్

అనంతపురం JNTUలోని సివిల్ ఇంజనీరింగ్ సీనియర్ ప్రొఫెసర్ వైశాలి ఘోర్పడే ప్రతిష్టాత్మక IEI అవార్డుకు ఎంపికయ్యారు. ఇంజనీర్స్ డే సందర్భంగా ఈనెల 15న ఈ అవార్డును అందుకోనున్నారు. ఇంజనీరింగ్ రంగంలో అందించిన విశిష్ట సేవలకు గాను.. 2024లో ఏపీ బెస్ట్ ప్రొఫెసర్ అవార్డు, 2025లో ISTE బెస్ట్ సివిల్ ఇంజనీరింగ్ టీచర్ అవార్డును ఆమె సొంతం చేసుకున్నారు.