హైదరాబాద్: 28°C
తెలంగాణ

మత్తు చాక్లెట్‌ ఇచ్చి బాలిక బంగారు కమ్మలు చోరీ..!

జనగామ పట్టణంలోని హనుమకొండ రోడ్డులో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న బాలికకు ఓ మహిళ మత్తు చాక్లెట్‌ ఇచ్చి చెవులకు ఉన్న బంగారు కమ్మలను అపహరించింది. ఆ బాలిక అస్వస్థతకు గురై ఐదు రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందింది. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.