హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పులివెందులలో ప్లాస్టిక్‌పై తనిఖీలు

KDP: పులివెందులలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగం, విక్రయాలు,నిల్వను అరికట్టేందుకు మున్సిపల్‌ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిషేధిత ప్లాస్టిక్‌కు బదులుగా గుడ్డ సంచులు వినియోగించాలని కమిషనర్‌ సూచించారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించి పట్టణ పరిశుభ్రతకు సహకరించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.