హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పార్వతీపురంలో కుంకీ ఏనుగు సందడి

PPM: కొమరాడ మండలం కోనవలస వద్ద తిష్ఠ వేసిన అడవి ఏనుగులను అటవీ ప్రాంతానికి తరలించేందుకు కుంకీ ఏనుగులను తీసుకువెళ్తున్నారు. సోమవారం గుచ్చిమి నుంచి పార్వతీపురం పట్టణం మీదుగా కోనవలసకు వాహనాల్లో కుంకీ ఏనుగులు తరలివెళ్లాయి. పట్టణంలో ఏనుగు కనిపించడంతో ప్రజలు ఆసక్తిగా సెల్‌ఫోన్లలో వీడియోలు, చిత్రాలు తీశారు.