హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యమకారుడు బుచ్చయ్య కన్నుమూత

WGL: ఖానాపురం మండలంలోని అశోక్‌నగర్‌కు చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దంతాల బుచ్చయ్య (102) సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. 1949లో సూర్యాపేట ప్రాంతంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసినట్లు ఆయన కుమారుడు అమర్‌నాథ్‌ తెలిపారు. బుచ్చయ్యకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. బుచ్చయ్య మృతిపై పలువులు సంతాపం తెలిపారు.