హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆశా వర్కర్ల ముందస్తు అరెస్ట్..!

KMR: హైదరాబాద్‌లో నిర్వహించనున్న ధర్నాకు వెళ్లకుండా KMR మండలంలోని పలువురు ఆశా వర్కర్లను దేవునిపల్లి పోలీసులు ఇవాళ తెల్లవారుజామున ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఉ. 4 గంటల సమయంలో వారి ఇళ్లకు చేరుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఈ చర్యలపై ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న ధర్నాను అడ్డుకోవడం సరికాదన్నారు.