KRNL:మంత్రాలయం మండలం సుగూరులో ఎస్సై మల్లికార్జున పర్యటించి వినాయక చవితి ఉత్సవాల నిబంధనలపై అవగాహన కల్పించారు. విగ్రహాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో విధిగా అనుమతి తీసుకోవాలని సూచించారు. ఆన్లైన్ దరఖాస్తు విధానం, క్యూఆర్ కోడ్ జనరేట్ అయ్యే తీరును వివరించారు. మండపాల నిర్వహణ నిబంధనలు, నిమజ్జనవేళ పాటించాల్సిన అంశాలపై ఉత్సవ కమిటీలకు దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి: ఎస్ఐ


