హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్య రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత: ఎమ్మెల్యే

W.G: కూటమి ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యతనిస్తోందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. సోమవారం సాయంత్రం తాడేపల్లిగూడెం గణేష్ నగర్లో రూ.2.55 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ప్రజల భాగస్వామ్యం, దాతల సహకారంతో ఆధునిక వసతులతో కూడిన భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.