హైదరాబాద్: 28°C
తెలంగాణ

హోంగార్డు కళ్యాణ్‌ కుమార్తెకు అరుదైన ఘనత

BDK: ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన HCA అండర్-19 క్రికెట్ టీం సెలక్షన్‌లో మణుగూరుకు చెందిన గుండెల నేహా అద్భుత ప్రతిభ కనబరిచి స్టేట్ అండర్-19 క్రికెట్ టీంకు ఎంపికైంది.హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న గుండెల కళ్యాణ్ కుమార్తె నేహా చిన్ననాటి నుంచే క్రికెట్‌పై ఆసక్తి పెంచుకుంది. పట్టుదలతోసత్తా చాటి రాష్ట్ర జట్టుకు ఎంపికైందని కుటుంబ సభ్యులు తెలిపారు.