హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమస్యలపై సత్వరమే స్పందించి న్యాయం చేయాలి: ఎస్పీ

ADB: పట్టణంలోని పోలీసు ముఖ్య కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. సమస్యలపై సత్వరమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలీసులపై ప్రజల విశ్వాసం మరింత పెరిగేలా పారదర్శకంగా పనిచేయాలని కోరారు.