WGL: తల్లిదండ్రులు జన్మనిస్తే.. గురువులు జీవితాన్నిస్తారని వర్ధన్నపేట పట్టణంలో ఎంపీడీవో వెంకటరమణ అన్నారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని శాలువాలు, ప్రశంసాపత్రాలతో సన్మానించారు.
తెలంగాణ
గురువులు జీవితాన్నిస్తారు: ఎంపీడీవో


