హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుమారులు పట్టించుకోవడం లేదని వృద్ధురాలి ఫిర్యాదు

JGL: మెట్‌పల్లి ఆరపేటకు చెందిన చౌటుపల్లి సత్తమ్మ తన ఇద్దరు కుమారులు, కుమార్తె పట్టించుకోవడం లేదని సోమవారం ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. భర్త మూడేళ్ల క్రితం మృతి చెందారని తెలిపారు. వారసత్వంగా వచ్చిన ఆరు ఎకరాల భూమిని కుమారులు తీసుకుని తనను ఒంటరి చేశారని ఆరోపించారు. తన పోషణ బాధ్యత కుమారులు తీసుకునేలా చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు.