హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జీపీ స్థలం పంచాయతీ అవసరాలకు కేటాయించాలి'

HNK: భీమదేవరపల్లి మండలంలోని గట్లనర్సింగాపూర్ జీపికి చెందిన 6గుంటల స్థలాన్ని పంచాయతీ అవసరాలకే కేటాయించాలని సర్పంచ్ బొల్లంపల్లి అజయ్ కుమార్ కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌ని కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రామపంచాయతీకి ఉపయోగపడాల్సిన స్థలంపై నెలకొన్న సమస్యను పరిష్కరించి, పంచాయతీ ఆధీనంలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు.