హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మూగజీవాలను కొట్టడం అరికట్టాలి'

BDK: అలసిపోయిన మూగజీవాలను కొట్టడం వంటి చర్యలను అరికట్టాలని కోరుతూ సోమవారం బీజేపీ ప్రతినిధులు భద్రాచలం డీఎస్పీ, ఎస్ఓపీఓ అరుణ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఎద్దులు, ఆవులతో ఇసుక బండ్లు లాగిస్తూ అధిక బరువులు మోయించడం, విశ్రాంతి లేకుండా తిప్పడం, గోదావరి ఇసుక ర్యాంపుల నుంచి భద్రాచలం వైపు ఇసుక తరలించే సమయంలో పశువులపై ఈ చర్యలు జరుగుతున్నాయని అన్నారు.