హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎక్సైజ్ సీఐగా బాధ్యతల స్వీకరణ

NGKL: నాగర్‌కర్నూల్ పట్టణ ఎక్సైజ్ సీఐగా శ్రీకాంత్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పదోన్నతిపై శంషాబాద్ నుంచి వచ్చిన ఆయనకు సిబ్బంది శాలువా, పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లైసెన్సులు లేని బెల్ట్‌షాపులు, అక్రమ సారాయి తయారీపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.