హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పెసర పంట కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేయవద్దు'

KMM: పెసర పంట కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయవద్దని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్ అన్నారు. రైతాంగ సమస్యలపై సోమవారం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్‌కు రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పెసర పంటను కొనుగోలు చేయాలని చెప్పారు. అలాగే ఎరువుల ఆన్‌లైన్ బుకింగ్ యాప్ సమస్యను పరిష్కరించాలని కోరారు.