హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన

MDK: మెదక్ సబ్ డివిజన్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో మాచవరం జడ్పీ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. గుడ్ టచ్-బ్యాడ్ టచ్, సైబర్ నేరాలు, టీ-సేఫ్ యాప్, బాలల అక్రమ రవాణా అంశాలపై అవగాహన కల్పించారు. చిన్నారులు, మహిళల భద్రతే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారన్నారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉంటూ సురక్షితంగా ఉండాలని పిలుపునిచ్చారు.