WGL: GWMC 20వ డివిజన్ పరిధిలోని కాశీబుగ్గలో గల శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. నేడు పవిత్రమైన శ్రావణమాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని 27 కిలోల చెక్కెరతో మహా లింగాభిషేకం నిర్వహించి, విశేష పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. ఆలయం మొత్తం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
తెలంగాణ
శివయ్యకు చెక్కెరతో అభిషేకం


