MLG: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను అధికారులు బాధ్యతగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 36 దరఖాస్తులు అందాయి. వీటిలో భూ సమస్యలు 9, ఇందిరమ్మ ఇండ్లు 1, పింఛన్లు 1, ఉద్యోగాలు 15, ఇతర సమస్యలు 10 ఉన్నాయి. నిర్ణీత గడువులో పరిష్కరించి అర్జీదారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
తెలంగాణ
'ప్రజావాణి దరఖాస్తులను బాధ్యతగా పరిష్కరించాలి'


