హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాలలను తనిఖీ చేసిన ఎంఈవో

VZM: తెర్లాం మండలం ఆర్‌.గదబవలస, అప్పలంపేట మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలను ఎంఈవో త్రినాథరావు ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన స్థాయిలు, వర్క్‌బుక్స్‌ కరెక్షన్‌, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం, సిలబస్‌ పూర్తి, మరుగుదొడ్ల నిర్వహణను పరిశీలించారు. అలాగే, వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.