BDK: పినపాక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు వ్యక్తిగత, గ్రామ సమస్యలపై అధికారులకు దరఖాస్తులు అందజేశారు. అధికారులు వినతులను స్వీకరించి సంబంధిత శాఖలకు పంపించారు. సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. దరఖాస్తుదారులకు రసీదులు అందజేశారు.
తెలంగాణ
పినపాక ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి


