AKP: పాత లోసింగిలో బావి ఎండిపోవడంతో 50 కుటుంబాలు గుక్కెడు నీటికి అల్లాడుతున్నాయి. ట్యాంకు ఉన్నా నీరందక, 2 కి.మీ నడిచి గెడ్డలో చలమ తవ్వుకుని ఊట నీటిని వడకట్టి తాగుతున్నారు. కలుషిత నీటితో నిత్యం రోగాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి రిగ్ బోరు వేయించాలని గిరిజనులు సోమవారం వేడుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: తాగునీటికి గిరిజనుల పాట్లు


