హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు జాబ్‌మేళా

JGL: జగిత్యాల జిల్లా ఉపాధి కల్పన శాఖ కార్యాలయంలో ఈ నెల 8న ఉదయం 10:30 గంటలకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సత్యమ్మ తెలిపారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టెలికాలర్స్ పోస్టులు 30, సూపర్వైజర్ పోస్టులు 3కు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని చెప్పారు. ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ధ్రువపత్రాలతో హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.