విజయనగరం జిల్లా భోగాపురంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. బైక్ రిపేర్ డబ్బులు ఇవ్వలేదని మెకానిక్ మహేశ్, అతడి స్నేహితులు ఓ యువకుడిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. చొక్కా విప్పించి చేతులు, మెడకు తాళ్లు కట్టి రోడ్డుపై నడిపించారు. అనంతరం బైక్‌తో వీధుల్లో లాక్కెళ్లారు. వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేసి SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
విజయనగరంలో అమానవీయ ఘటన


