హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కార్తీక మాసం పుష్కరాలకు ఏర్పాట్లు షురూ..!

E.G: కార్తీక మాసం, 2027 పుష్కరాల నేపథ్యంలో అన్నవరం దేవస్థానంలో ముందస్తు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. భక్తుల రద్దీ పెరగనుండటంతో అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు కొండపైగల భూతాది ప్రసాదం తయారీ విభాగాన్ని పరిశీలించారు. భక్తులకు ప్రసాదం కొరత లేకుండా తయారీ సామర్థ్యం పెంచేలా ప్రణాళికలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పొయ్యిల విస్తరణ, ఆధునీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు.