కర్నూలు టెలికాంనగర్‌లోని విశ్రాంత అధ్యాపకులు అంకన్న, బాలస్వామి నివాసాల్లో అర్ధరాత్రి ముగ్గురు దొంగలు చోరీకీ యత్నించారు. తలుపు పగులగొట్టగా ఇంట్లోకి వస్తుండగా పైఅంతస్తులో ఉండే ఓ మహిళ దొంగను చూసి కేకలు వేసింది. వారి వెంట తెచ్చిన ద్విచక్ర వాహనం, రాడ్లను వదిలేసి దొంగలు పారిపోయారు. సీసీ కెమెరాల ఆధారంగా కర్నూలు 3 టౌన్ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
కర్నూలులో రెచ్చిపోతున్న దొంగలు


