హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణపతి నవరాత్రుల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

కోనసీమ: అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిర్వహించనున్న వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను సోమవారం ఆవిష్కరించారు. పి.గన్నవరం ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం 10 గంటలకు నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తన చేతుల మీదుగా ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు.