హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీని వీడి టీడీపీలో 42 కుటుంబాల చేరిక

GNTR: చేబ్రోలు మండలం వేజండ్ల ఎస్సీ కాలనీకి చెందిన 42 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సమక్షంలో వారికి పసుపు కండువాలు కప్పి ఆహ్వానించారు. వేజండ్ల అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.