హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారిని దర్శించుకున్న రోజా

TPT: మాజీ మంత్రి ఆర్కే రోజా సన్నిహితులతో కలిసి తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు ఆలయ రంగనాయకులు మండపంలో వేద ఆశీర్వచనంతో అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం బయట ఆమెతో అభిమానులు ఫొటోలు దిగారు.