హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ

SKLM: టెక్కలి పట్టణం ఆది ఆంధ్ర వీధికి చెందిన దేవాది మేరీ పుట్టినరోజు సందర్భంగా కుమార్తెలు సునీత, అనిత, మమతలు అభయం యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో మూడు నిరుపేద కుటుంబాలకు నెలకు సరిపడా 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు, ఆర్థిక సాయం అందజేశారు. 'మార్నింగ్ వాక్ ఫర్ పూర్ పీపుల్'లో భాగంగా ఈ సాయం అందించామని సంఘం అధ్యక్షుడు దేవాది శ్రీనివాసరావు తెలిపారు.