హైదరాబాద్: 28°C
తెలంగాణ

బంగారం కోసం వృద్ధురాలిపై దాడి

NZB: డబ్బు, బంగారం కోసం వృద్ధురాలిపై గుర్తుతెలియని దుండగుడు దాడి చేసిన ఘటన జిల్లా కేంద్రంలోని బంగారు మైసమ్మ కాలనీలో చోటుచేసుకుంది. కాలనీకి చెందిన అరుంధతి అనే వృద్ధురాలు ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రపోతుండగా, ఓ దుండగుడు కత్తెరతో దాడి చేసి చెవులను కత్తిరించి బంగారు కమ్మలను తీసుకున్నాడు. డబ్బులు కావాలని ఒత్తిడి చేశాడు. లేవనడంతో మెడ, వీపుపై కత్తితో దాడి చేసి పారిపోయాడు.