హైదరాబాద్: 28°C
తెలంగాణ

రక్తబంధమా? రాక్షసత్వమా? సంచిలో దారుణం!

NGKL: అమ్రాబాద్‌లో దారుణ హత్య కలకలం రేపింది. బురాన్ అనే వ్యక్తిని అతడి భార్య, ఇద్దరు కుమారులు కలిసి మూడు రోజుల క్రితం ఇంట్లోనే హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో ఉంచి ఇంటికి తాళం వేసి నిందితులు పరారైనట్లు సమాచారం. దుర్వాసన రావడంతో అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.