VSP: దువ్వాడ పోలీసుల వేగవంతమైన స్పందనతో ఐదేళ్ల చిన్నారి గంటలోనే తల్లిదండ్రుల చెంతకు చేరింది. వడ్లపూడి జంక్షన్ వద్ద ఆదివారం రాత్రి 7.30 గంటలకు అనిత ఒంటరిగా కనిపించింది. సమాచారం అందుకున్న వెంటనే సీఐ ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగి వివరాలు సేకరించారు. గంటలోనే తల్లిదండ్రులను గుర్తించి చిన్నారిని సురక్షితంగా వారికి అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్
గంటలో ఆచూకీ.. తల్లిదండ్రులకు చిన్నారి అప్పగింత


