హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి పై అదుపుతప్పిన కారు

HYD: సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి పై ఓ కారు ప్రమాదానికి గురైంది. స్థానికుల వివరాలు.. కారు అదుపుతప్పి బ్రిడ్జి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు యువకులు ఉండగా ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.