హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరాటేలో గోల్డ్ మెడల్ సాధించిన చిన్నారి

BDK: ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2026లో పాల్వంచకు చెందిన రావుల దితికశ్రీ సత్తా చాటింది. మాస్టర్ కోనే సూరిబాబు ఆధ్వర్యంలో ఈ చిన్నారి ఆరెంజ్ బెల్ట్ లో శిక్షణ పొందారు. గోల్డ్ మెడల్ సాధించడంతోపాటు బెస్ట్ ఫైటర్ అవార్డు అందుకున్నారు. క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో ఈ విజయం సొంతమైందని శిక్షకుడు సూరిబాబు హర్షం వ్యక్తం చేశారు.