హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబానికి CMRF చెక్కు అందజేత

NZB: చందూర్ మండలం ఘన్పూర్‌కు చెందిన తోకల నరేష్కు ముఖ్య మంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.28 వేల చెక్కును సోమవారం సర్పంచ్ ముత్తకుంట కృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ బాధిత కుటుంబాలకు కొంత అండగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దీపిక, ఉపసర్పంచ్ గంగారాం పాల్గొన్నారు.