హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తోపులాటలో కిందపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు

HYD: అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నేతలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో మాజీ మంత్రి హరీష్ రావు కిందపడిపోయారు. ప్రతిపక్ష నేతల పట్ల పోలీసులు అప్రజాస్వామికంగా, దురుసుగా వ్యవహరించారని బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. రేవంత్ సర్కార్ భయంతోనే ఈ భౌతిక దాడులు, అరెస్టులకు పాల్పడుతోందని మండిపడ్డారు.