హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వంట చేసేందుకు వెళ్లి.. మహిళ మృతి

ELR: పెదవేగి మండలం వంగూరుకు చెందిన కొట్టే సుజాత (39) అనే మహిళ ఇంటి వద్ద నీళ్లు పడుతుండగా కరెంట్ షాక్‌కు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భోజనం సిద్ధం చేసేందుకు వెళ్లిన ఇల్లాలు ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకున్నాయి.