హైదరాబాద్: 28°C
తెలంగాణ

పగిలిన పైప్‌లైన్.. తాగునీటికి తిప్పలు

ASF: బెజ్జూర్ మండలం, ఎలుకపల్లి(బి)లో 15 రోజులుగా మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలి తాగునీరు అందక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వార్డు సభ్యులు ఆరోపించారు. పైప్‌లైన్ పగిలిన చోట చేరుతున్న మురికినీటినే కాలకృత్యాలకు వాడుకోవాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను  పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.