హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేవైఎం నేతల ముందస్తు అరెస్ట్

MDK: విద్యార్థుల పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ బీజేవైఎం చేపట్టిన చలో అసెంబ్లీకి బయల్దేరిన నాయకులను సోమవారం నిజాంపేట మండల పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ప్రభుత్వ నిర్బంధాలకు భయపడేది లేదని, విద్యార్థుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటాన్ని ఆపేది లేదని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.