హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్‌ విమానాశ్రయానికి గ్లోబల్‌ గుర్తింపు

HYD: రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మూడు ప్రతిష్ఠాత్మక ఏసీఐ వరల్డ్‌ గుర్తింపులు సాధించింది. కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్‌ అక్రిడిటేషన్‌లో లెవల్‌-5, యాక్సెసిబిలిటీ ఎన్‌హాన్స్‌మెంట్‌లో లెవల్‌-2 పొందింది. 2025 ఏసీఐ ఏఎస్‌క్యూ అవార్డుల్లో ప్రపంచంలోని ఉత్తమ రాక విమానాశ్రయాల్లో చోటు దక్కించుకుంది. ప్రయాణికుల అనుభవంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పింది.