హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో రూ.21 లక్షలు మోసం

RR: ఎల్బీనగర్‌ ఆర్కేపురం కాలనీకి చెందిన 68 ఏళ్ల నాగలక్ష్మిని టెలికాం, పోలీసులు, సీబీఐ అధికారులమంటూ సైబర్‌ నేరగాళ్లు బెదిరించారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ వీడియో కాల్‌లో విచారించి, అరెస్టు చేస్తామని భయపెట్టారు. దీంతో బాధితురాలు రూ.21 లక్షలు నిందితుల ఖాతాలకు బదిలీ చేసింది. కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.