KMM: సన్న రకాల వరి సాగు చేసిన రైతులు క్వింటాలుకు రూ.500 బోనస్ పొందడానికి సెప్టెంబర్ 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సోమవారం నేలకొండపల్లి ఏవో సరిత తెలిపారు. ప్రభుత్వం గుర్తించిన 7 సన్న రకాల విత్తనాలు సాగు చేసిన వారికే ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. డీలర్ల వద్ద కొనుగోలు చేసిన రైతులు పాస్‌బుక్, ఆధార్, రశీదులతో ఏఈవోలను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
సెప్టెంబర్ 10లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి: AO


