హనుమకొండ జిల్లా కేంద్రంలో బీజేపీ రాష్ట్ర నాయకురాలు రావు పద్మారెడ్డిని సోమవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు చలో హైదరాబాద్ తరలి వెళ్లడానికి సిద్ధమవుతున్న ఆమెను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. సుబేదారి పోలీసుల తీరును రావు పద్మ ఖండించారు. తమ అరెస్ట్‌లతో ఉద్యమాన్ని ఆపలేరని తక్షణమే విద్యార్ధుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
రావు పద్మా రెడ్డిని గృహనిర్బంధం చేసిన పోలీసులు


