హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: MLA

HNK: 5వ డివిజన్ రెడ్డి కాలనీ రోడ్డు నెం.2లో రుద్రసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా గణపతి ఆగమన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హాజరై విగ్రహ ఆగమనాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే నాయిని సూచించారు.